పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న కస్టమర్‌లు ఇప్పుడు నెలలో చేసే ఆర్థిక లేదా ఆర్థికేతర ATM లావాదేవీలకు కొత్త ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని పోస్ట్ శాఖ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. అక్టోబర్ 1 నుండి పోస్ట్ ఆఫీస్ ATM/డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీ రూ .125 GST చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఈ ఛార్జీలు అనేవి ఈ సంవత్సరం(2021) అక్టోబర్ 1వ తేదీ నుండి వచ్చే సంవత్సరం (2022) 30 సెప్టెంబర్  వరకు వర్తిస్తాయి.ఇక అంతేగాక ఇప్పుడు SMS హెచ్చరికల కోసం, ఇండియా పోస్ట్ ఇప్పుడు వినియోగదారుల నుండి రూ .12 GST ని కూడా వసూలు చేస్తుంది.ఇక ఈ కొత్త సర్క్యులర్ ప్రకారం తెలిసిందంటే..ఇండియా పోస్ట్ కస్టమర్ తన ATM కార్డును పోగొట్టుకున్నాడు, అక్టోబర్ 1వ తేదీ నుండి కొత్తది పొందడానికి వారు రూ. 300 తో పాటు GST కూడా చెల్లించాలి , వారు రూ .50 పైగా GST ని చెల్లించాల్సి ఉంటుంది.

ఇక అలాగే అదనంగా, తగినంత అకౌంట్ బ్యాలెన్స్ లేనందున ATM లేదా POS లావాదేవీలను తిరస్కరించినట్లయితే, కస్టమర్ దాని కోసం మరోసారి రూ .20 పైగా GST కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఇండియా పోస్ట్ సొంత ATM లలో కేవలం ఐదు ఉచిత లావాదేవీలు మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత, ఖాతాదారులు ప్రతి లావాదేవీకి రూ .10 తో పాటు GST చెల్లించాల్సి ఉంటుందని కూడా పోస్ట్ శాఖ తెలిపడం జరిగింది. ఇక అంతేగాక , వినియోగదారులు ఐదు ఉచిత లావాదేవీల తర్వాత ఆర్థికేతర లావాదేవీల కోసం రూ. 5 తో పాటు GST ని చెల్లించాల్సి ఉంటుంది. పాయింట్ ఆఫ్ సర్వీస్ (POS) వద్ద నగదు విత్‌డ్రా కోసం, డెబిట్ కార్డ్ హోల్డర్లు లావాదేవీకి 1% చెల్లించాల్సి ఉంటుంది, అది ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ .5 కి లోబడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: