ఎల్పిజి గ్యాస్ ఖాతాదారుల అందరికీ కేంద్ర ప్రభుత్వం మంచి శుభవార్తను తీసుకొచ్చింది. ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్ ద్వారా సిలిండర్ తీసుకున్నవారికి సబ్సిడీని తమ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించుకుంది కేంద్ర ప్రభుత్వం. మొన్నటివరకు గ్యాస్ పై వచ్చే సబ్సిడీ నిలిపి వేసిన విషయం తెలిసిందే. సామాన్య ప్రజలు గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు కావడంతో ఏం చేయాలో తెలియక చాలా సతమతమవుతున్నారు. అందుకే అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఎల్పీజీ సబ్సిడీ ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఒక్కో సిలిండర్‌పై సబ్సిడీ రూ.158.52 నుంచి  రూ.237.78 వరకూ ఇవ్వబడుతుంది.ఇక ముఖ్యంగా  ఎల్‌పీజీ వినియోగదారులందరూ మార్కెట్‌ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి వుంటుంది. ప్రభుత్వం ఈ  సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలలోకి  బదిలీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌లు ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద అందజేస్తోంది ప్రభుత్వము. అయితే ప్రభుత్వం ఇక సబ్సిడీ ను మీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి  mylpg.in వెబ్‌సైట్‌కు వెళ్లి ఎంత వేశారో తెలుసుకోవచ్చు.


1. వెబ్ సైట్ ఓపెన్ చేసి , గ్యాస్ సిలిండర్ ఎల్పిజి ఐడి మీకు తెలియక పోయినట్లయితే 17 అంకెల ఎల్పీజీ నెంబర్ కింద ఉన్న బటన్ ని క్లిక్ చేయాలి.

2. అప్పుడు మీరు ఏ కంపెనీకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ ను ఉపయోగిస్తున్నారు అని అడుగుతుంది.

3. ఎల్పీజీ ,ఇండియన్, భారత్  అనే 3 ఎంపిక ఆప్షన్లు కనిపించినప్పుడు మీరు ఏది ఉపయోగిస్తున్నారో ఆ కంపెనీ పై క్లిక్ చేయండి .

4. మీరు మా కంపెనీ ఏదో ఎంచుకున్న తర్వాత వేరే పేజ్ కు డైరెక్ట్ అవుతుంది.

5. ఇప్పుడు మీ పేరు , పంపిణీదారుణి పేరు ,  వినియోగదారుల సంఖ్య,  ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

6. క్యాప్చా నెంబర్ వస్తుంది. దాన్ని టైప్ చేసి సబ్మిట్ చేస్తే వివరాలు తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: