కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ విధించింది. ప్రభుత్వ ఉద్యోగం లో ఉద్యోగం చేసి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందుతున్నారు.. వాళ్ళందరూ లైఫ్ సర్టిఫికెట్ డాక్యుమెంట్ ను సబ్మిట్ చేయాలని దాదాపు మూడు నెలల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది..కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు లైఫ్ సర్టిఫికెట్ ఎక్కడ సబ్మిట్ చేయలేదు.. వెంటనే సంబంధిత కార్యాలయంలో సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఇప్పుడు ఎందుకిలా పెడుతున్నారు అంటే చాలామంది వ్యక్తి మరణించిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం. కాబట్టి ముందుగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వారికోసమే ఈ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి అని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం.


ముందుగా ఈ లైఫ్ సర్టిఫికెట్ లో ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తే..

ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఆ లబ్ధిదారులకు తప్పకుండా పాన్ కార్డు ఉండి తీరాలి.

పాన్ కార్డు ఉన్నవారు లబ్ది దారులు లైఫ్ సర్టిఫికెట్ కోసం పెన్షన్ సేవ పోర్టల్లోకి మీరు వెళ్ళాలి.

ఈ పాటలో కి వెళ్ళిన తర్వాత వీడియో ఎల్ సి అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, ఆ తర్వాత ఎస్బిఐ పెన్షన్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత ఓటిపి వస్తుంది.. దీన్ని ఎంటర్ చేసి  కండిషన్స్ అప్లై  మీద క్లిక్ చేసిన తర్వాత , స్టార్ట్ జర్నీ అనే బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఇక ఆ తర్వాత మీకు ఐయామ్ రెడీ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి. ఒక వెంటనే మీకు ఎస్బిఐ అధికారి నుంచి వీడియో కాల్ రావడం ప్రారంభమవుతుంది. వెరిఫికేషన్ కోసం ఎదురు గా ఉన్న స్క్రీన్ మీద నాలుగంకెల కోడ్ కనిపిస్తుంది.. దానిని ఎంటర్ చేసిన తర్వాత ఒరిజినల్ పాన్కార్డు చూపించాలి. తర్వాత పాన్ కార్డును లబ్ధిదారుల ఫోటోల్ని తీసుకుంటే.. వీడియో లైఫ్ సర్టిఫికెట్ పూర్తవుతుంది. కాబట్టి ఒకవేళ ఈ ప్రాసెస్లో ఏదైనా
 పొరపాటు జరిగితే మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. చివర్లో ఈ లైఫ్ సర్టిఫికెట్ మీరు పెన్షన్ తీసుకునే బ్యాంకు కి వెళ్లి సబ్మిట్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: