కరోనా వైరస్ ప్రస్తుతం మూడవ దశ ను చూపిస్తోంది.. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే మాసం లో ఒకటవ తేదీన ఈ ఏడాదికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశ పెట్ట బోతోంది. అయితే ఈ బడ్జెట్ పైన ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు గా తెలుస్తోంది. ముఖ్యంగా టూ వీలర్స్ పై ఉన్నటువంటి..GST ని 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్స్ డీలర్స్ కోరడం జరుగుతోందట.. ఇక ఈ మధ్య ఎక్కువగా వాహనాలకు అతిగా డిమాండ్ ఉందని ఆర్గనైజేషన్స్ తెలియజేస్తున్నారు.. అంతేకాకుండా ప్రభుత్వం ఈ జీఎస్టీ రేటును మరికాస్త తగ్గిస్తే.. అప్పుడు వాహనాలు మరింత డిమాండ్ పెరుగుతాయని తెలుపుతున్నారు.

ఆటోమొబైల్స్ డీలర్స్ మాత్రం టూ వీలర్స్ అనేది ఒక లగ్జరీ ప్రాజెక్టు కాదని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వీటిపై జిఎస్టి రేట్ తగ్గించాలని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 15 వేల ఆటోమొబైల్ డీలర్స్ ఈ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయితే ఈ డిమాండ్ ని ఫిబ్రవరి 1-2022 నుండి 2023 వర్క్ బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నారని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేయడం జరిగింది. ఇది సామాన్యులకు రోజువారి పని దినాలకు వెళ్లే వాహనంగా ఉంటుంది కనుక అలాంటివి లగ్జరీ ప్రొడక్ట్ ల పరిగణించడం సరికాదని ఆటోమొబైల్ సంస్థ వారు తెలియజేశారు


ప్రస్తుతం 28 శాతం వరకు జీఎస్టీ ఉన్నదని దానిని తగ్గించడం మంచిది అని తెలియజేశారు. అయితే వాహనాలు ఎక్కువ ధరలు పెరగడం వల్ల వాటి డిమాండు క్రమంగా తగ్గిపోతుంది అని పలువురు సంస్థ అధినేతలు తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే జీఎస్టీ రేటును తగ్గిస్తే మరింత అవి పుంజుకునే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల అందరూ ఎక్కువగా కార్లు వాడకాన్ని ఎక్కువ చేస్తున్నారు అని  దాదాపుగా 10 ఏళ్ల కనిష్టానికి  సేల్స్ పడిపోయాయని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: