గణిత శాస్త్రంలో అంకె ఎలా మొదలైన సరే 1 నుంచి మొదలు కావాల్సిందే.. అలా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ ఒక్క రూపాయి తో అంత తక్కువ అంచనా వేయకండి.. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఒక రూపాయి ఆదా చేసుకుంటే చాలు రెండు లక్షల రూపాయల బెనిఫిట్ పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అంతేకాదు ప్రతి నెల కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుంది ఈ అద్భుతమైన బెనిఫిట్స్ ను పొంది అవకాశాన్ని మనకు కల్పించింది కేంద్ర ప్రభుత్వం..

పూర్తి వివరాల గురించి మనం తెలుసుకుందాం.. అదేమిటంటే ప్రతి సంవత్సరం 12 రూపాయలు చెల్లిస్తే రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తుంది. ఇదే కాకుండా మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి.. సాధారణంగా ఇది విన్న వెంటనే ఎవరైనా సరే ఒక రూపాయికి ఏమొస్తుంది.. ఈ కాలంలో అయితే ఏమీ రాదు..అట్లీస్ట్ చిన్న పిల్లలు తినే చిన్న చాక్లెట్ కూడా రాదు అని చెప్పవచ్చు. ఇక బయటకు వెళ్లే టీ తాగాలన్నా సరే కనీసం ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే రోజురోజుకూ ధరలు అలా పెరిగిపోతున్నాయి కాబట్టి.. అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది..

అది మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు..సంవత్సరానికి పన్నెండు రూపాయలు చెల్లిస్తే ప్రమాద బీమా కింద రెండు లక్షల రూపాయలు వర్తిస్తుంది అంటే మీరు నెలకి ₹1 పొదుపు చేస్తే సరిపోతుంది అన్నమాట.. ఇక ఈ స్కీం లో చేరిన వారికి ప్రతి సంవత్సరం కూడా వారి ఖాతా నుండి పన్నెండు రూపాయలు అయితే కట్ అవుతుంది.. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా ఈ డబ్బులు కట్ అవుతాయి అనే విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. మే నెల చివరిలో డబ్బులు ఖాతా నుంచి డెబిట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఎవరైనా సరే ఈ పథకంలో చేరిన వారు తప్పకుండా ఖాతాలో రూ.12 కలిగి ఉండాలి. 18-70 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు.

మరింత సమాచారం తెలుసుకోండి: