రివర్స్ రెపో రేటును 0.20 - 0.25 శాతం వరకు పెంచే అవకాశం ఉంటుందని బార్క్లేస్ పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతం ఉండగా మరో పావు శాతం వృద్ధిరేటు పెంచితే ప్రజలకు ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలియడం లేదు.. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఊహించని విధంగా రుణ సమీకరణ పరిమాణాన్ని యూనియన్ బడ్జెట్ లో 2022-2023 ఆర్థిక సంవత్సరంలో పెంచినందుకు గాను పాలసీ సాధారణీకరణ ఆర్బిఐ సంకేతాలు ఇస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
ఇకపోతే పెట్రోలియం ధరలు ఐదు రాష్ట్రాలలో పెరిగబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సమయం లో పెట్రోల్ ధరలు పెంచకూడదు అని నినాదాలు వినిపించడంతో అందుకు తగ్గట్టుగానే పని చేయనున్నట్లు సమాచారం.. ఇకపోతే మొత్తానికి అయితే ఆర్.బి.ఐ వడ్డీ రేట్లు పావు శాతం పెంచనుందని సమాచారం.. ఇకపోతే ఈ వడ్డీ రేట్ల వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే విషయాన్ని నిగ్గు తేల్చలేదు.. మరో వారంలో పూర్తి సమావేశం ముగిసిన తరువాత వడ్డీరేట్లను నిజంగానే పెంచారా లేక అపోహ మాత్రమే నా పెంచితే ఎవరికి నష్టం లేదా ఎవరికి లాభం అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి