సొంతంగా మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా..?  ఇక ఇంటి నుంచి వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లు అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే అని చెప్పవచ్చు. ఈ వ్యాపారం యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే అన్ని సీజన్లలో కూడా ఈ వ్యాపారానికి పెద్ద డిమాండ్ ఉంటుంది. మీరు కేవలం మంచి మార్కెటింగ్ ఏర్పాటు చేసుకుంటే మీ బిజినెస్ కు తిరుగు ఉండదు అని చెప్పవచ్చు . ఒక ఈ వ్యాపారం ఏదో కాదు మసాలా మేకింగ్ యూనిట్. ఇక ప్రారంభించడానికి తక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. కానీ ప్రాఫిట్ మాత్రం చాలా ఎక్కువగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ముఖ్యంగా భారతదేశ వంటగదిలో సుగంధ ద్రవ్యాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది . అందుకే దేశంలో మిలియన్ల టన్నుల కొద్ది వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతూ ఎగుమతి కూడా అవుతున్నాయి. ఇక వీటి నుంచి మీరు మంచి మసాలాలు గనుక తయారు చేసి విక్రయించినట్లు అయితే లాభాలతో పాటు వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక మీ స్థానికంగా ఉండే ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు వాటి అభిరుచులకు అనుగుణంగా మీరు మసాలాలు తయారుచేసి అమ్మి నట్లయితే మీ వ్యాపారంలో సక్సెస్ పొందడమే కాదు మీరు తయారు చేసే మసాలా మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది.

ఇక మసాలా తయారీ యూనిట్ ను  ఏర్పాటు చేయాలి అంటే ఎక్కువ డబ్బు అవసరం లేదు. ఇక మసాలా మేకింగ్ యూనిట్కు కేవలం 3.5 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.  300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటు చేసుకుంటే.. షెడ్డుకు 60 వేల రూపాయలు,  మిగతా పరికరాలకు 40 వేల రూపాయలు ఖర్చవుతుంది. ప్రారంభించడానికి రూ. 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. బ్యాంకులు కూడా మీకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద మొత్తం పెట్టలేము అనుకునే వాళ్ళు కనీసం పదివేలతో అయినా కూడా మీరు వ్యాపారం మొదలుపెట్టి లక్షల్లో లాభార్జన పొందవచ్చు. ఇక ప్రతినెల 20వేల రూపాయలు సులభంగా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: