ఎల్ఐసి ప్రవేశపెట్టిన జీవన్ ఉమాంగ్ పాలసీ ద్వారా ఇది సాధ్యమవుతుంది అని చెప్ప వచ్చు. జీవన్ ఉమాంగ్ పాలసీ ఒక ఎండో మెంట్ పాలసీ.. పోస్ట్ ఆఫీస్ స్కీం లాగే ఈ పాలసీ ద్వారా కూడా మంచి లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేయడానికి ఈ పథకం బాగా పనిచేస్తుంది. ఎల్ఐసి లో జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకునే వారికి 100 సంవత్సరాల జీవిత బీమా ఉచిత రక్షణ కల్పించడం గమనార్హం. ఇక ఇందులో 90 రోజుల నుండి 55 సంవత్సరాలు వయసు కలిగిన వారు పాలసీ తీసుకోవడానికి అర్హులు అవుతారు.

ఇకపోతే ఈ ప్లాన్ లో మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత ప్రతి సంవత్సరం ఖాతాదారుడు నిర్ణీత మొత్తంలో డబ్బు పొందవచ్చు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే అతని నామినీకి మొత్తం డబ్బులను ఒకేసారి చెల్లించడం జరుగుతుంది.ఇక మీరు జీవన్ ఉమంగపాలసీలో 15, 20, 25,30 సంవత్సరాల పాటు పెట్టుబడిగా డబ్బు పెట్టవచ్చు ఇక ఒకవేళ ప్రమాదవశాత్తు మరణించినా..అంగవైకల్యానికి గురైన సరే జీవన్ ఉమాంగ్ పాలసీ ప్రకారం ఆ వ్యక్తికి టర్మ్ రైడర్ కూడా లభిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వారికి పున్నమినహాయింపు లభిస్తుంది అన్నమాట.


ఇక మీరు 26 సంవత్సరాల వయసులో జీవన్ ఉమన్ పాలసీని కొనుగోలు చేస్తే రూ.4.5 లక్షలు బీమా రక్షణ కోసం మీరు 30 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇక నెలకు మీరు 1350 రూపాయలను చెల్లించాలన్నమాట. అంటే ప్రతిరోజు 45 రూపాయలను ఆదా చేస్తే సరిపోతుంది . ఇక సంవత్సరానికి రూ.15,882 30 సంవత్సరాల లో మీరు చెల్లించే మొత్తం ప్రీమియం రూ.4,76,460 60 అవుతుంది. ఇక ఎల్ఐసి 31 వ సంవత్సరం నుంచి మీ పెట్టుబడి పై మీరు ప్రతి ఏడాది రూ.36000 ను పొందవచ్చు. ఇక అలా మీకు 100 ఏళ్ల వయసు వచ్చేవరకు మీ డబ్బు మీకు వెనక్కి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: