కస్టమర్లను ఆకర్షించడానికి అలాగే ఆర్థికంగా వారిని అభివృద్ధి పరచడానికి పోస్ట్ ఆఫీస్ రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరొక సరికొత్త పథకాన్ని తమ కస్టమర్ల కోసం అందించడానికి సిద్ధమైంది. ఇకపోతే ఎవరైతే డబ్బు దాచుకోవడానికి కొత్త ప్రణాళికలను అమలు చేసుకుంటున్నారో అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకం మంచి ఆదాయాన్ని అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా ఈ ప్లాన్ ద్వారా మీరు ప్రతి నెల కొంత డబ్బులు జమ చేస్తే మంచి ఆదాయాన్ని కూడా అందుకోవచ్చు.

ఇక నెలకు రూ 2,201 అంటే రోజుకు 70 రూపాయల చొప్పున మీరు డిపాజిట్ చేయడం వల్ల నిర్ణీత కాలం ముగిసే సరికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు . ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ కవరేజ్ ప్లాన్ కింద అర్హులు అవుతారు. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న యుగల్ సురక్ష పథకం కింద మీరు పెట్టుబడి పెట్టుకుంటే మెచ్యూరిటీ పై మొత్తం హామీ లభించడంతోపాటు బోనస్ కూడా పొందుతారు. ఇకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఈ పాలసీని తీసుకోవడానికి కుదరదు. చాలామంది ప్రజలు దీన్ని తీసుకోవడానికి అర్హులు అవుతారు అలాంటి వారిలో  ముఖ్యంగా ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, లిస్టెడ్ కంపెనీ ఉద్యోగులు, ఇంజనీర్లు, వైద్యులు, బ్యాంకర్లు ,న్యాయవాదులు , ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలలో ఉద్యోగాలు చేసేవారు మాత్రమే ఈ ప్లాన్ తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇక 21 నుంచి 45 సంవత్సరాల వయసులోపు ఉన్నవారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఉదాహరణకు ఐదు లక్షల హామీతో పోస్ట్ ఆఫీస్ లో భార్యాభర్తలిద్దరూ ఈ పాలసీని తీసుకుంటే 20 సంవత్సరాల పాటు ప్రతినెల రూ.2201 చెల్లించాల్సి ఉంటుంది. 20 సంవత్సరాలకు గాను మొత్తం రూ.5,28,922 చెల్లిస్తారు ఇక 20 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత హామీ రూ.5 లక్షలతో పాటు బోనస్ కూడా  రూ.5,20,000 లభిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే  రూ.10,20,000 రూపాయలను మీరు సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: