
ఒకవేళ పాలసీదారుడు మధ్యలో మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక ప్రయోజనాన్ని అందించబోతున్నారు. పాలసీ కాలవ్యవధి ఐదు సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి డెత్ బెనిఫిట్స్ ఒకేసారి లేదంటే ఐదేళ్లపాటు వాయిదా పద్ధతిలో కూడా పొందుతారు. ఇది నాన్ లింక్డు.. పార్టిసిపేటింగ్.. ఇండివిజువల్ .. సేవింగ్ ప్లాన్.ఈ నాలుగు ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఏబీ ఆప్షన్స్ లో హామీ మొత్తం కనీసం రూ.3,30,000 అలాగే ఆప్షన్ సి లో రూ.2,50,000 అలాగే ఆప్షన్ డి లో రూ.22,00,000 వరకు సమ్ అస్యూర్డ్ ను పొందవచ్చు..
ఈ స్కీం లో చేరడానికి పాలసీదారుడు వయసు కనీసం మూడు సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి ఏ, బీ లకు 50 సంవత్సరాలు, సీ కి 65 సంవత్సరాలు అలాగే డి పరిమితి 40సంవత్సరాలుగా ఉండాలి. ముఖ్యంగా ఏడాదికి కనీస ప్రీమియంగా 30 వేల రూపాయలుగా ఉంటుంది ఐదు , పది లేదా 15 సంవత్సరాల పాలసీ గనుక మీరు ఎంచుకున్నట్లయితే ప్లాన్ లో కనిష్టంగా రూ.2.5 లక్షలు, గరిష్టంగా రూ.22 లక్షల అస్యూర్డు పొందే అవకాశం ఉంటుంది.