అంతేకాదు అంగవైకల్యం, వితంతు మహిళలకు వారు నెలకొల్పే వ్యాపారం ఆధారంగా రుణ పరిమితి పెరిగే అవకాశం కూడా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే మహిళలకు ఆర్థిక భరోసాని కల్పించడానికి ఆత్మ నిర్భర్ కార్యక్రమాలలో భాగంగా ఈ పథకాన్ని తీసుకురాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 48 వేల మంది మహిళలు లబ్ధి పొందారు. ఇకపోతే రుణం తీసుకున్న మహిళలకు 12 శాతం వరకు వడ్డీ మీద రుణం అందించనున్నారు. ఇక అంగవైకల్యం , వితంతు మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి అని కూడా పేర్కొన్నారు.
ఇకపోతే మహిళల క్రెడిట్ స్కోర్ , సిబిల్ స్కోర్ ఆధారంగా రుణం అందించబోతున్నారు. గతంలో తీసుకున్న రుణాలను సరిగ్గా తిరిగి చెల్లించకపోతే ఈ రుణం వర్తించదు. అందుకే దరఖాస్తు చేసుకునే మహిళలు ఆధార్ కార్డు, ఇన్కమ్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా బుక్ వంటివి అందించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగిని పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు సమీపంలో ఉన్న బ్యాంకులను సంప్రదించి పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి