కేంద్ర ప్రభుత్వం నుంచి పలు రకాల పథకాల వల్ల కొంతమేరకు ఆర్థిక సహాయాన్ని ప్రజలు , యువత బిజినెస్ పరంగా అందించడానికి సహాయపడుతూ ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీతో 10 లక్షల రూపాయలను లోన్ అందించబోతోంది. ఈ స్కీం కింద ఎవరైనా సరే అర్హులుగా ఉంటే లోన్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఈ స్కీం కింద లక్షలాదిమంది యువత లోన్ సదుపాయాన్ని తీసుకున్నారు.. అలవారు సొంతంగానే బిజినెస్ లను ఉద్యోగాలను కూడా మొదలుపెట్టారు. సొంతంగా ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన అనే సదుపాయాన్ని అందిస్తోంది.


దీంతో 50 వేల నుంచి పది లక్షల రూపాయల వరకు లోన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. వడ్డీ రేటు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ లోన్ తీసుకోవడానికి ఎటువంటి హామీ కూడా లేకుండానే తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ని 2017 లో ప్రధానమంత్రి మొదలుపెట్టారు. చాలా మంది యువత మరియు మహిళలు తమ సొంతంగా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకునేవారు. ఈ ముద్ర యోజన స్కీం కింద రుణాన్ని పొందవచ్చు.


దీనికి అవసరమైన అర్హతలు మరియు పత్రాల విషయానికి వస్తే ఈ ముద్ర లోన్ పొందడానికి భారతీయ పౌరుడై ఉండాలి 20 నుంచి 70 ఏళ్ల వయసు మధ్య కలిగిన వారు ఉండాలి.. కావలసిన పత్రాలు విషయానికే వస్తే అడ్రస్ ప్రూఫ్.. ఆధార్ కార్డు పాన్ కార్డ్ మొదలు పెట్టబోయి బిజినెస్ గురించి పూర్తి వివరాలను పత్రాలను తీసుకొని సమీపంలో ఉండే ఏదైనా బ్యాంకు బ్రాంచిని సంప్రదించి దరఖాస్తు ఫారం ని ఫిలప్ చేస్తే ఈ ముద్ర యోజన లోన్ తీసుకోవచ్చు. మీ ఉద్యోగం కోసం మీ డబ్బులు 25% పెట్టుబడి పెడితే 75% రుణంగా తీసుకోవచ్చట దీనిని ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు ..mudra.org.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: