మన చుట్టూ ఉండే పరిసరాలకు అనుగుణంగానే మనం కొన్ని బిజినెస్లను మొదలుపెట్టడం వల్ల మంచి లాభాలను అందుకోవచ్చు.. ముఖ్యంగా ఉల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఉల్లితో బిజినెస్ను మొదలు పెడితే మంచి లాభాలను అందుకోవచ్చు.. ఇంతకీ ఉల్లి ద్వారా ఎలా లాభాలను అందుకోవచ్చు.. ఈ బిజినెస్ కు కావలసిన పెట్టుబడి ఎంత ఏ ఏ వస్తువులు కావాలో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

అనుకోకుండా మార్కెట్లోకి ఉల్లికి మంచి డిమాండ్ ఒక్కొక్కసారి వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిని క్యాష్ చేసుకొని వ్యాపారంగా మార్చుకుంటే భారీ లాభాలను అందుకోవచ్చు. కొన్నిసార్లు ఉల్లి ధర భారీగా ఉండడంతో ఉల్లి పొడిని ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది. అందుకే ఉల్లిపొడి కి సైతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఉల్లి పొడి తయారు చేసేటువంటి యూనిట్ని మొదలుపెట్టడం వల్ల భారీగా లాభాలను పొందవచ్చు. ప్రతి ఏటా దేశంలో సుమారుగా 20 నుంచి 25% వరకు నిరుపయోగంగా మారుతోందట.. అయితే ఉల్లిని సరిగ్గా ఉపయోగించుకొని పౌడర్ తయారు చేయడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు.


ఉల్లిపాయలు ఎన్నో రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్రామాలలో వీటి గురించి పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ సదుర పట్టణాలలో అయితే మంచి డిమాండ్ ఉండడమే కాకుండా ఎక్కువగా ఉపయోగిస్తారు. సూపర్ మార్కెట్లలో ఉల్లి పౌడర్ ప్యాకెట్లను చూడవచ్చు.. ఉల్లిగడ్డలకు బదులుగా ఉల్లి పౌడర్ ను ఉపయోగించడం వల్ల రుచిగా కూడా ఉంటుంది హోటల్స్ లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సొంత ఇల్లు ఉన్న పరవాలేదు.. లేకపోతే 600 చదరపు అడుగుల స్థలం ఉన్న సరిపోతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి డిహైడ్రేషన్ మిషన్ ,గ్రైండర్ మాత్రమే అవసరం పడుతుంది. దీనికి రూ.3నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏడాది మొత్తం ఆదాయాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: