చాలామంది యువత ఈ మధ్యకాలంలో ఉద్యోగాన్ని కంటే బిజినెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఇందులో చాలామంది ఉద్యోగం మానేసి మరి ఇంట్లోనే మహిళలు పిల్లలను చూసుకుంటూ బిజినెస్ వైపుగా అడుగులు వేస్తున్నారు. చిన్న హోమ్ బేస్డ్ బిజినెస్ ను మొదలుపెట్టి వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే కొంత మొత్తం డబ్బును భారీగా సంపాదించుకోవచ్చు. అలాంటి బిజినెస్ ఐడియాలను ఇప్పుడు ఒక్కసారి చూద్దాం.


1). డే కేర్ సెంటర్:
ఇది చిన్న పిల్లల కొరకు మాత్రమే నడిపే సెంటర్ ఈ మధ్యకాలంలో భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలకి వెళ్లాల్సినప్పుడు పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఈ బిజినెస్ ని గంటకింత అని చొప్పున తీసుకుంటే నెలకి భారీగానే ఆదాయాన్ని అందుకోవచ్చు. అయితే ఇందుకోసం పిల్లలకు ఆడుకునేందుకు స్లీపింగ్ చేసేందుకు కొన్ని సపరేట్ రూమ్స్ ఉండాలి.

2). బ్యూటీ పార్లర్:
ఇది ఎక్కడ పెట్టినా కూడా సక్సెస్ అయ్యే బిజినెస్ అని చెప్పవచ్చు దీనికి పెట్టుబడి తో పాటు ఇంకా కొన్ని అవసరం పడతాయి. మీరు బ్యూటీషియన్ గా సరైన సర్టిఫికెట్ ఉంటే చాలు ఈ బిజినెస్ ప్లాన్ అదుర్స్ అని చెప్పవచ్చు.

3). బేక్డ్ గూడ్స్:
కుకీస్ కప్ కేక్స్ వంటి వాటికి ఏడాది మొత్తం మంచి డిమాండ్ కలదు. ఇలాంటి తప్పులను సరికొత్త డిజైన్లతో తయారు చేసి సేల్ చేసుకోవడం వల్ల మంచి లాభాలను అందుకోవచ్చు.


4). ఆర్ట్స్ క్రాఫ్ట్స్:
పేపర్ తో తయారు చేసేటువంటి ఫ్లవర్ మ్యాజిక్ పెయింటింగ్ డ్రాయింగ్ వంటి వాటి వల్ల చిన్నపిల్లల మైండ్ సెట్ పూర్తిగా మారుతుంది. దీనికే ఎక్కువమంది పేరెంట్స్ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిని అదునుగా చేసుకుంటే సంపాదన మార్గం భారీగా ఎంచుకోవచ్చు.


5). కుకింగ్ క్లాసెస్ క్యాటరింగ్ బిజినెస్ వంటివి మొదలుపెట్టడం వల్ల కూడా మంచి లాభాలను ఆర్జించవచ్చు.అలాగే వీటి గురించి ఆన్లైన్ క్లాసులు చెప్పడం వల్ల కూడా మంచి లాభాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: