మనలో చాలా మంది తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటారు. అయితే అలాంటి వారి కోసం తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాన్ని ఇచ్చే ఐడియా ఉన్నది.. ఇలా చేస్తే కచ్చితంగా నెలకు రెండు లక్షల వరకు మనం ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఆ వ్యాపారమే గొర్రెల వ్యాపారం.. గొర్రెలు, మేకల వ్యాపారం ప్రస్తుతం ఎక్కడ చూసినా బాగా నడుస్తూనే ఉంది. ఈ వ్యాపారం తక్కువ మొత్తం పెట్టుబడిలో పెడితే మంచి లాభాలను సైతం అందిస్తుంది. గొర్రెల పెంపకం ద్వారా మంచి లాభాలు చాలామంది వ్యాపారస్తులు అందుకుంటున్నారు.


 ఇంటి దగ్గర నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఒక చక్కటి అవకాశం.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో గొర్రెల పెంపకం చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలామంది దీనిపైన ఆధారపడి జీవనాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటారు. అలాగే గొర్రెల వల్ల వచ్చేటువంటి పాలు ,ఎరువు కూడా మంచి లాభాలను అందిస్తుంది. గొర్రెల పెంపకం వ్యాపారానికి పెద్దగా ఎలాంటి ఆర్భాటాలు అవసరం లేదు ప్రభుత్వం నుంచి కూడా గొర్రెలు పెంపకానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది.


ముఖ్యంగా గడ్డికి 90 శాతం సబ్సిడీ కూడా ఇస్తుంది. గొర్రెల పెంపకానికి డబ్బులు లేకపోతే బ్యాంకులో పలు రుణాలు కూడా తీసుకోవచ్చు. నాబార్డ్ కూడా గొర్రెల పెంపకానికి రుణాలు ఇస్తోందట. అయితే గొర్రెల వ్యాపారం ప్రారంభించాలంటే కొన్ని విషయాలు తెలిసి ఉండాలి.. గొర్రెలకు మేత ,నీరు, క్లైమేట్, సమయానికి వైద్యుడు వంటి వాటిని మెయింటైన్ చేస్తే చాలు ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా గొర్రెల పైన చాలా అవగాహన ఉండి ప్రమాదానికి సంబంధించిన రోగాలపైన కాస్త తెలిసి ఉండాలి. గొర్రెలు మేకల మాంసానికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఇలా ఖచ్చితంగా గొర్రెల బిజినెస్ వల్ల నెలకి ఎంత లేదన్న లక్ష నుంచి రెండు లక్షల వరకు మనం ఆదాయాన్ని అందుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: