చాలామంది ప్రజలు తమకు ఉండేటువంటి సౌకర్యాలలోనే పలు రకాల పంటలను పండిస్తూ బాగానే డబ్బులను సంపాదిస్తూ ఉంటారు.. అయితే అతి తక్కువ సమయంలోనే లక్ష్యాధికారి కావాలి అంటే స్ట్రాబెరీ పంటను వేయడం ఉత్తమం.. ఇప్పటికే చాలామంది రైతులు యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ , నేరేడు పళ్ళు ఇతరత్రా వాటిని పండిస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. అయితే స్ట్రాబెరీ పంటలు మాత్రం చాలామంది తక్కువ రైతులే పండిస్తూ ఉన్నారు. విదేశాలలో కూడా వీటికి మంచి డిమాండ్ ఉన్నది. తాజాగా విదేశాలలో పుట్టి ఆంధ్ర ఊటీలో వింటర్ డ్రాగన్ స్ట్రాబెరీ పంటను ఒక గిరిజన రైతు పండిస్తూ భారీగా సంపాదిస్తున్నారు వాటి గురించి చూద్దాం.


అమెరికాలో పుట్టిన స్ట్రాబెరీ పంట ఇప్పుడు మన దేశానికి కూడా విస్తరిస్తోంది. అరకు లోయలో గిరిజన రైతులు విజయవంతంగా ఈ పంటను పండిస్తూ ఉన్నారు. స్ట్రాబెరీ పంట బాగా సాగు చేసుకోవచ్చు.. శీతాకాల వాతావరణంలో విశిష్టంగా కలిగిన ఈ స్ట్రాబెరి విశాఖపట్నం జిల్లా వాతావరణం చాలా అనుకూలంగా మారుతోంది. అయితే స్ట్రాబెర్రీ రైతులు ఇప్పటికే లంబసింగి ప్రాంతంలో వీటిని సాగు చేస్తున్నారు.. ఒకప్పుడు చాలా ధనవంతుల సైతం ఈ స్ట్రాబెరీ లను తినేవారు.. కానీ ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఈ గిరిజన ప్రాంతాలలోని రైతులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.


అరకు లోయలో ఉండే నాలుగు ఎకరాల స్ట్రాబెరీ పనులను పండిస్తూ ఉన్నారు. అక్కడి వాతావరణం తగ్గట్టుగా దిగుబడి కూడా భారీగానే వస్తోంది. ఎకరాకి ఐదు లక్షల పెట్టుబడి పెట్టడంతో మూడు నెలలలోనే 15 నుంచి 20 లక్షల వరకు లాభం అందుతోందట. ప్రస్తుతం ఉన్న డిమాండ్ ను బట్టి మూడు నుంచి 400 రూపాయల వరకు కేజీ పలుకుతోందట. అయితే ఆర్గానిక్ పద్ధతిలోనే ఈ బండ్లను పండిస్తూ ఉండడం చేత తినడానికి మంచి రుచిగా ఉంటున్నాయని అక్కడి రైతులు ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. అక్కడ స్థానిక రైతులకు ధరలలో కాస్త మినహాయింపు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: