ప్రస్తుతం భారతదేశంలో ఎండలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.ఇంకా ఎండాకాలం రాకముందే సూర్యుడు భగభగ మాండేస్తూ ఉన్నారు. చాలామంది బయటకు వెళ్తే ఖచ్చితంగా చల్లటి జ్యూస్ ని తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో చల్లని జ్యూస్ సెంటర్ ని ప్రారంభిస్తే మంచి లాభాలు కూడా అందుకోవచ్చు.. భారతదేశంలో ప్రారంభించే ముందు ఈ జ్యూస్ సెంటర్ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


ముఖ్యంగా ఎవరైనా ఇండియాలో ఈ జ్యూస్ వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే ముందుగా వ్యాపారిగా తమకంటూ ఒక ఐడినీ నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లోనైనా చేసుకోవచ్చు. అయితే ప్రతిదీ కూడా సరిగ్గా జరిగిందని నిర్ధారించుకున్న తర్వాతే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాలి ముఖ్యంగా లైసెన్సు విషయంలో చట్టబద్ధంగానే పనిచేయడానికి అధికారుల నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అలాగే మనం చేసేటువంటి ఉత్పత్తుల రకం మీ వ్యాపారానికి సంబంధించిన వాటిపైనే ఆధారపడి లైసెన్స్ ఫీజు ఉంటుంది


ముడి సామాగ్రి విషయానికి వస్తే జ్యూస్ సెంటర్ ప్రారంభించడానికి సీసాలు, లేబుల్స్, మిక్సీ, ఫ్రిడ్జ్  వంటి వాటికి ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది. ఈ వస్తువులు పూర్తిగా కొనుగోలు చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా లీజుకు తీసుకోవచ్చు. ముందుగా ధరలు నాణ్యతను గుర్తించడం ముఖ్యం. మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏదైనా అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కస్టమర్లు సైతం చాలా ఎక్కువగా కలిసే చోట ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టడం ఉత్తమం.

మీ వ్యాపారాన్ని నిర్వహించడంలో మీకు సహాయపడడానికి కొంతమంది సిబ్బందులను తీసుకోవడం మంచిది. ఈ ఎండాకాలం సీజన్ లో బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్పవచ్చు.. వీటితోపాటు బోండాలను కూడా పెట్టుకోవడంతో మరింత లాభాలను అందుకోవచ్చు. అతి తక్కువ పెట్టుబడితో లక్షలలో లాభాలను సైతం పొందవచ్చు. జ్యూస్ కస్టమర్లను సైతం ఆకర్షించగలిగితే మరిన్ని లాభాలను పొందవచ్చు. మీరు తయారు చేసేటువంటి జ్యూస్ ఎల్లప్పుడూ కూడా తాజాగా ఉంచుకునేలా చూసుకోవాలి. ఈ జ్యూస్ బిజినెస్ వల్ల ఎలాంటి నష్టం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: