మనం చేస్తున్న పనికి మనమే యజమాని అయితే ఆనందం వేరేగా ఉంటుందని చాలా మంది భావించే సొంతంగానే చిన్న బిజినెస్ అయిన ప్రారంభించాలనుకుంటారు. తమతో పాటు మరి కొంతమంది ఉపాధి కల్పించాలని కలలు కంటూ ఉంటారు.ఇలా ముందుగానే ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలనే విషయం పైన ఎన్నో ఆచితూచి అడుగులు వేస్తూ ఒక నిర్ణయానికి వచ్చి పలు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు. చాలా మంది ఆదాయం ఎక్కువగా ఉండే వ్యాపారాల వైపే మొగ్గు చూపాలని చూస్తూ ఉంటారు. పట్టణాలలోని వ్యాపారాలు చేస్తే మంచి లాభాలు ఉంటాయని అనుకుంటారు. అయితే పల్లెటూర్లలోనే ప్రారంభించిన మంచి లాభాలను అందుకునే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి.


వ్యవసాయ సంబంధానికి సంబంధించి పనిముట్లకు సంబంధించి వ్యాపారాన్ని మొదలుపెట్టడం వల్ల మంచి లాభాలను అందుకోవచ్చు.. నాణ్యత ఉంటే కచ్చితంగా కస్టమర్లను రాబడితే ఈ బిజినెస్ మించిన ఆదాయం ఉండదు.


ఈమధ్య చాలామంది బిజీ ఉన్న లైఫ్ లో కొన్ని కొన్ని వాటిని చేసుకోలేకపోతున్నారు. అలాంటి వాటిలో ఊరగాయ కూడా ఒకటి ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా మంచి లాభాలను అందుకుంటారు.

వర్మీ కంపోస్ట్ బిజినెస్ పెట్టడం వల్ల నష్టం అనేది ఉండదు వీటిని కొనడానికి చాలామంది రైతులు ఎక్కువగా మక్కువ చూపుతారు.చౌక ధరకే ఎక్కువ నాణ్యమైన కంపోస్ట్ ఎరువు లభించడం వల్ల రైతులకు లాభమే అటు వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది.


పల్లెలలో బ్యూటీ పార్లర్ సెంటర్ ని పెట్టడం వల్ల గ్రామాలలో ఉండే మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది టైంపాస్ బిజినెస్ గా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా టైలరింగ్ ని మెయింటైన్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి.



కలబందను సాగు చేసి అమ్మే వ్యాపారం చేయడం వల్ల కూడా మంచి లాభాలను పొంద వచ్చు. కలబంద దాదాపుగా భారీ రేటుకే అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: