ప్రస్తుతం ఉన్న కాలంలో ఉద్యోగం కంటే సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలని ఆసక్తి చూపించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.ఎవరైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఆ తర్వాతే వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. మీరు ప్రతిరోజు రూ.5000 రూపాయలను సులభంగా సంపాదించుకునే వ్యాపారం ఒకటి ఉన్నది.అదే అరటిపండు చిప్స్ వ్యాపారం.. ఈ వ్యాపారంలో ముడి సరుకు సమస్యకు ఏ విధంగా డోకా ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా అరటి పండ్లు దొరుకుతూనే ఉన్నాయి.


క్లైమేట్ ఎలా ఉన్నప్పటికీ ప్రజలు ప్రతిరోజు అరటిపండు చిప్స్ తింటున్నారు. పెద్ద బ్రాండ్లతో పోటీ లేనప్పటికీ మార్కెట్లో మాత్రం విపరీతమైన డిమాండ్ కలిగి ఉంది. బంగాళదుంప చిప్స్ లాగే దీనికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. అరటిపండు చిప్స్ లను తయారు చేసుకోవడానికి పలు రకాల యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు.. వీటికి కావలసినది ముడి అరటి పండ్లు, తగినంత నూనె, ఉప్పు, మసాలా దినుసులు మాత్రమే ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. అరటిపండు చిప్స్ చేయడానికి ముందుగా వీటిని కడగడానికి నీరు కూడా అవసరం అరటి పండ్లు తొక్కలు తీయడానికి వాటిని సన్నని ముక్కలుగా కత్తిరించడానికి కూడా ఒక మిషన్ ఉండాలి.


మసాలాలు కలపడానికి ఒక యంత్రం కూడా ఉంటుంది. అయితే ఈ యంత్రాల పెట్టుబడి విషయానికి వస్తే 50 నుంచి 60 వేల వరకు అవుతుందట. ఏదైనా రూమ్ లో వీటిని మనం బిగించుకోవచ్చు.. అరటిపండు చిప్స్ ప్యాకెట్ మార్కెట్లో 70 రూపాయల వరకు వెళ్తోంది.. కేజీ పైన కనీసం 20 రూపాయలు లాభం వేసుకున్న రోజు కనీసం 50 కేజీల అరటిపండు చిప్స్ ను ఉత్పత్తి చేసుకోవచ్చు.. అంటే రోజుకి 10000 లాభం వస్తుంది.. ఇందులో పెట్టుబడి కింద 5000 తీసేసిన 5000 ప్రతిరోజు మిగులుతుంది.. ఇలా ప్రతి నెల రూ.1.50 లక్షల నుంచి 3 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఈ చిప్స్ ని మనం ఎక్కడైనా సరే హోల్సేల్ గా కూడా అమ్ముకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: