కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను సైతం ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం బాగా ఉపయోగపడుతోంది. ఇది ఆడపిల్లల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఒక పథకం.. ఈ పథకం ద్వారా కూతురు వివాహం కోసం లేదా ఆమె పై చదువుల కోసం డబ్బుని ఆధా చేసుకోవచ్చు.. ఈ పథకాన్ని పెట్టుబడిలో పెట్టడానికి కచ్చితంగా భారతీయ పౌరుడై మాత్రమే ఉండాలి. ఆడపిల్ల పుట్టినప్పటినుంచి ఆమెకు పది సంవత్సరాల వయసు వచ్చేవరకు ఈ అకౌంట్ ని ప్రారంభించవచ్చు.


ఒకే కుటుంబంలో ఇద్దరు కుమార్తెల పేరుతో కూడా ఈ ఖాతాను సైతం ప్రారంభించవచ్చు.. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు శాఖలో ఈ సుకన్య సమృద్ధి పథకాన్ని మొదలు పెట్టవచ్చు ఈ పథకం ద్వారా ఎంత రాబడి వస్తుంది ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఈ సుకన్య సమృద్ధి పథకం కింద ఏడాదికి 250 నుంచి రూ.1.5 లక్షల వరకు చేయవచ్చు. ఖాతా తెరిచిన సంవత్సరం నుంచి 14 సంవత్సరాల పాటు ఈ డిపాజిట్ ను చేస్తూ ఉండాలి.

ఒకవేళ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మొత్తం మూడు లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా నెలనెలా పద్ధతిలో అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. మొత్తం 21 సంవత్సరాల తరువాత వీటిని తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి వడ్డీ రేటు 8.4 శాతం ఉన్నది. ఉదాహరణకు సంవత్సరానికి ₹1000 కనీస పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల పాటు అలా చేస్తే 21 ఏళ్ల తర్వాత 46,800 పొందవచ్చు.. ఒకవేళ ఏడాదికి రూ.1,50,000  పెట్టుబడి పెడితే ఇలా 15 ఏళ్లు  పెట్టినట్లు అయితే 21 సంవత్సరాలకు రూ.70,20,000 పొందవచ్చు.


 ఏడాది డిపాజిట్:           21 సంవత్సరాల మొత్తం:
రూ.1000                           రూ.46,800పొందవచ్చు.
రూ.2000                            రూ.93,600
రూ.5000.                            రూ.2,34,000
రూ.20000.                         రూ.9,36,000
రూ.50000.                        రూ.23,40,000
రూ.1,00,000.                    రూ.46,80,000
రూ.1,50,000.                    రూ.70,20,000

మరింత సమాచారం తెలుసుకోండి: