భారతదేశంలో యాలుకలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నది.. దీనిని వాణిజ్య పంటగా కూడా పరిగణిస్తారు దీని సాగు ద్వారా చాలామంది రైతులు భారీగానే సంపాదిస్తూ ఉన్నారు.. ఎవరైనా యాలకుల వ్యవసాయం చేయాలనుకుంటే అందుకు కొన్ని ముఖ్య అంశాలను కూడా తెలుసుకోవాలి ఇండియాలో యాలుకలు ప్రసిద్ధంగా పొందిన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, కేరళ ,తమిళనాడు వంటి రాష్ట్రాలలో వీటి సాగు ఎక్కువగా కొనసాగిస్తున్నారు. ఏలుకలను ఎక్కువగా మిఠాయి ఇతరత్రా పానీయాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వీటి సువాసన కూడా ఎక్కువగానే ఉంటుంది.


ఇసుక నేలలు ఏలుకలను సాగు చేయలేము ఇందులో చాలా నష్టాలు కూడా ఎదురవుతాయి.. అందుకే ఇలాంటి వాటికి లెటర్ రైట్ నేల, నల్ల నేలలు బాగా ఉపయోగపడతాయి.. వీటిని సాగు చేయాలంటే 10 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద సాగు చేయాలి. ఎలుకల మొక్క ఒకటి నుంచి రెండు అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. వీటిని ఎలా పెంచాలి ఏ విధంగా నాటాలి అనే విషయాన్ని యూట్యూబ్లో చూసి తెలుసుకోవడం ఉత్తమం.. ఏలుకల మొక్క సిద్ధం కావడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు పడుతుందట.


ఈ ఏలుకలను కోసిన తర్వాత కొన్ని రోజులపాటు ఎండలో ఆరబెట్టాలి.. వానాకాలంలో ఏలుకల మొక్కలు నాటవచ్చు. జూలై నెలలో భారతదేశంలో వీటిని నాటవచ్చు. ఈ మొక్కలకు ఎల్లప్పుడూ నీడ ఉండేలా చూసుకోవాలి.. ఏలుకలు పూర్తిగా అయిన తర్వాత దానిని చేతులు లేదా కొబ్బరి చాప, వైర్ మిషన్ తో రుద్దుతారు అప్పుడు అవి సహజమైన రంగుకి మారుతాయి అట మార్కెట్లో వీటిని అమ్మడం ద్వారా మంచి లాభాలను అందుకోవచ్చు.. హెక్టార్కు 150 నుంచి 170 కిలోల దిగుబడి అందుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో యాలుకల కేజీ ధర రూ.1400 నుంచీ 2000 వరకు అమ్ముడుపోతోంది దీన్ని బట్టి చూస్తే మీరు రూ .5నుంచి 6 లక్షల వరకు సంపాదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: