పల్లెలలోనే పట్టణాలలోనైనా సరే ఎక్కడైనా విద్యుత్ కచ్చితంగా అవసరం.. కరెంటు లేకుంటే ప్రస్తుతం ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాము. వేసవి ప్రాంతాలలో విద్యుత్ కోతలు చాలా కామన్ గా మారుతున్నాయి.. అందుకు అవసరమైన విద్యుత్తును సైతం సోలార్ ద్వారా అందించడం బిజినెస్ గా మారుతోంది.. ప్రస్తుతం విద్యుత్ నడిచే వస్తువుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. వీటి వినియోగం కూడా పెరిగేకొద్దీ కరెంట్ బిల్లు పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామాలలో వ్యవసాయ పనులకు కూడా ఈ విద్యుత్ చాలా ముఖ్యమే.. కరెంట్ బిల్లు తగ్గించుకోవాలి అంటే సౌర శక్తిని కచ్చితంగా వినియోగించేందుకు చాలామంది మక్కువ చూపుతున్నారు..


ప్రస్తుతం సోలార్ విద్యుత్ కు మంచి డిమాండ్ ఉన్నది. ప్రభుత్వం కూడా వీటి వినియోగానికి ప్రోత్సహిస్తూనే ఉంది. సొంత ఊర్లలోనే సోలార్ ప్యానల్ వ్యాపారాన్ని ప్రారంభించి బాగానే లాభాలను పొందవచ్చు.. సోలార్ ప్యానల్ అనేది సౌర శక్తి నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి విధిని ఉపయోగిస్తూ ఉంటారు.. ఈ ప్యానెల్స్ ను ఇంటి పైన ఇన్స్టాల్ చేయడం ద్వారా పరికరాలను విక్రయించడం ద్వారా డబ్బు బాగానే సంపాదించుకోవచ్చు. ఈ సోలార్ పలకలు చతురస్రాకాలంలో ఉంటాయి. విద్యుత్తుతో నడిచే వస్తువులను కూడా వీటిని సెట్ చేసుకోవచ్చు.


మనం నగరాలలో లేదా గ్రామాలలో సోలార్ ప్యానల్ వ్యాపారాన్ని మొదలు పెడితే.. కచ్చితంగా మంచి లాభాలని ఆర్జించవచ్చు. సోలార్ ప్యానల్ వ్యాపారంలో ఎన్నో రకాలు ఉంటాయి ముఖ్యంగా సోలార్ సిస్టం, సోలార్ ప్యానల్ రిపేర్, సోలార్ ప్యానల్ తయారీ, సోలార్ ప్యానెల్ డిస్ట్రిబ్యూటర్, సోలార్ ఆడిటర్ మొదలైనవి మనం ఎంచుకోవచ్చు.. అయితే సోలార్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి. సోలార్ ప్యానల్ వ్యాపారాన్ని పరారం ఇచ్చాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కచ్చితంగా అవసరము. సౌర శక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి గవర్నమెంట్ సోలార్ ప్యానల్ ను కూడా ఏర్పాటు చేయిస్తోంది. అందుకే అధికారిక వెబ్సైట్ https://solarrooftop.gov.in/ దరఖాస్తు చేసుకోవాలి. సోలార్ ప్యానల్ వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే కనీసం ఒకటి నుంచి రెండు లక్షల వరకు ఖర్చవుతుంది. సోలార్ వ్యాపారంలో సర్వీస్ రిపేర్ ల వల్ల కస్టమర్లను ఆకట్టుకుంటే నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని అందుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: