ఎన్నికల వేల కేంద్ర ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించేందుకే పలు రకరకాల పథకాలను స్కీములను కూడా ప్రవేశపెడుతోంది. ఇప్పటికే గ్యాస్ ధరలను తగ్గించి పెట్రోల్ ధరలను తగ్గించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త స్కీములను కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సరికొత్త పథకానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు.. టూ వీలర్, త్రీ వీలర్ కొనుగోళ్ల పైన భారీ రాయితీని కల్పించబోతున్నారు. సుమారుగా 500 కోట్ల రూపాయలతో ఇందుకోసం ఒక స్కీమును కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.


మోడీ సర్కార్ టూవీలర్ త్రీ వీలర్ వాహనాల కొనుగోలు పైన భారీ రాయితీ ఇచ్చేందుకు సైతం సిద్ధమవుతోంది. అయితే అవి సాధారణ వాహనాలు కాదని కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త స్కీమును మొదలుపెట్టబోతున్నారట. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి భారీ ఎత్తున సబ్సిడీ కూడా ఇచ్చేందుకు.. ఇ - మొబిలిటీ ప్రమోషన్స్ స్కీం ..(EMPS -2024) సైతం ప్రారంభించారు.. ఈ మేరకు గడిచిన రెండు రోజుల క్రితం కేంద్ర  పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఈ విషయాన్ని సైతం తెలియజేశారు.


ఈ స్కీం కోసం ఏప్రిల్ నుంచి నాలుగు నెలల కోసం 500 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేయబోతున్నట్లు మహేంద్రనాథ్ పాండే వివరించారు. ఇండియాలో ఇ - మొబిలిటీ ప్రోత్సహించడానికి ప్రధానం మోరి సర్కార్ కట్టుబడి ఉందని ఇందులో భాగంగానే సరికొత్త స్కీములను తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. విద్యుత్ వాహనాలు మూడు చక్రాల వాహనాల పైన సబ్సిడీ ఇవ్వబోతున్నారు.. ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమలులోకి ఈ పథకం రాబోతోంది. దాదాపుగా ఈ ఏడాది జులై వరకే ఈ స్కీమ్ అందుబాటులో ఉండబోతోంది ఈ స్కీం కింద..3.3 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం గరిష్టంగా రూ .10 వేల సబ్సిడీ..31 వేల ఈ- రిక్షాల  పైన.. ఇతరత్రా వాటిపైన  25 వేల సబ్సిడీ కూడా వస్తుంది.. అదే పెద్ద వాహనాల త్రిచక్ర వాహనాలకు అయితే 50 వేల వరకు రాయితీ ఇస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: