ప్రతి ఒక్కరి జీవితం చాలా విలువైంది. ముఖ్యంగా లైఫ్ అనేది ఆనందంగా కొనసాగాలి అంటే అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను చేసుకోవడం చాలా ముఖ్యము.. అవి సరిగ్గా లేకుంటే జీవితం చివరి దశలో ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఇలా జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మన దేశంలో కొన్ని రకాల బీమా సంస్థలు ఇంత రత్ర స్కీములు పాలసీలు కూడా ఉన్నాయి.వీటిని సరైన ఎంపికలు పెట్టుబడులు పెడితే మనకు లైఫ్ లాంగ్ మంచి రిటర్న్ లభిస్తాయి..


అయితే ఇప్పుడు తాజాగా ఎల్ఐసి ఒక కొత్త ప్లాన్ తీసుకువచ్చింది.ఇందులో కనీసం ఐదేళ్లు కడితే లైఫ్ లాంగ్ రిటర్న్ వస్తూనే ఉంటుందట. ఎల్ఐసి తీసుకువచ్చిన ఈ కొత్త పాలసీని జీవన ఉత్సవ్.. ఈ పేరుతో కొత్త ప్లాన్ ను ఎల్ఐసి తీసుకువచ్చింది.ఈ ప్లాన్ ద్వారా జీవితాంతం గ్యారెంటీ రిటర్న్ కూడా లభిస్తుందట.. ఈ పాలసీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. పాలసీదారు జీవించి ఉన్నంతకాలం ప్రతి ఏడాది కూడా పెట్టుబడిలో 10% నగదును అందిస్తూనే ఉంటుందట.. నెలకు 4 వేలకు పైగా కచ్చితంగా రిటర్న్ వస్తుందట.


ఎల్ఐసి జీవన్ ఉత్సవ ప్లాన్లు చేరేందుకు 90 రోజులు వయసు నుంచి గరిష్టంగా 65 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులే.. మినిమం బేసిక్ మొత్తం అషూరుడ్ రూ .5లక్షలు గా ఉండాలి.. జీవన్ ఉత్సవ పాలసీ ప్రీమియం చెల్లింపు 5 నుంచి 16 ఏళ్ల మధ్య ఎంపిక చేసుకోవాలి.. ఈ ప్లాన్ తీసుకున్న పాలసీదారుడు అషూరుడ్ సైతం నుంచి ప్రతి ఏటా 10% చొప్పున జీవితకాలము అర్హులైన వారికి చెల్లిస్తూనే ఉంటారు. ఒకవేళ వందేళ్లు అర్హుడు బ్రతికే ఉన్న 10% రిటర్న్ అందిస్తూనే ఉంటుందట. దీని ప్రకారం చూసుకుంటే 5 లక్షల ప్లాన్ ఎంచుకుంటే ప్రతి ఏడాది 50వేల వరకు మీకు వస్తాయి.. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే బీమా కవరేజ్ కింద రూ .5లక్షలు అతని కుటుంబానికి చెందుతుందట. పూర్తి సమాచారం కావాలి అంటే ఎల్ఐసి సంస్థ సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: