మనం పనిచేస్తూ ఎంతో కొంత డబ్బును సైతం సంపాదించుకోవాలనుకుంటే ఈ రోజుల్లో అలాంటి వ్యాపారాలు చాలా తక్కువగానే ఉన్నాయి.. చాలా తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టేటువంటి వ్యాపారాలు కూడా ఉన్నవి.. అయితే ఆదాయం పెరిగినప్పుడు విటి విస్తరణ కూడా పెరుగుతుందని చెప్పవచ్చు.. కేవలం 50వేల రూపాయలతో ప్రారంభించగలిగేటువంటి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాపారాలను కేవలం ఇంట్లో నుంచి అయినా చేసుకొని మంచి లాభాలను కూడా పొందవచ్చు. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం.


1). మనం ఇంట్లోనే కూర్చొని తయారు చేసుకుని ఉరగాయ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి. కేవలం మొదట పదివేల పెట్టుబడితో పెడితే కనీసం నెలకి 30 నుంచి 40 వేలకు పైగా ఆదాయం వస్తుందట. ఈ ఊరగాయలను ఆన్లైన్ లేదా హోల్సేల్ మార్కెట్లో అమ్మడం వల్ల మంచి లాభాలు వస్తాయి.


2). అగర్బత్తిలను తయారు చేయడానికి కావలసినటువంటి పౌడర్ ,బొగ్గు ,వెదురు, నారింజ, పొడి నూనె ,నీరు, పూలరేకులు, గంధం వంటి వాటి ముడి పదార్థాల సరఫరా కోసం మనం ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలను అందుకోవచ్చు.


చాలామంది ఇంట్లో ఉండే మహిళలు ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటూ ఉంటారు అలాంటివారికి బెస్ట్ ఆప్షన్ టిఫెన్ సర్వీస్.. ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచే ప్రారంభిస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది.. దీనిని ప్రారంభంలో ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలతో ప్రారంభిస్తే దాదాపుగా ప్రతినెల 1 లక్షకుపైగా ఆదాయాన్ని అందుకోవచ్చు.


మనం ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా కొంతమేరకు డబ్బులను కూడా ఇస్తుంది.. ముఖ్యంగా స్వయం ఉపాధి పథకం కింద పచ్చళ్ళు తయారు చేయడం పచ్చళ్ళు ప్యాకింగ్ చేయడం వంటి వాటికి కాలి స్థలం అవసరం.. అందుకే 900 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉండే స్థలంలో బిజినెస్ పెడితే గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ రూపంలో డబ్బులు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: