ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు.. అందులో భాగంగానే పలు మార్గాలు కూడా వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. ఇక సంపాదించిన డబ్బును కూడా మనం దాచుకోవాలి.. అలా ప్రతినెల కొంత మొత్తంలో దాచుకుంటే ఊహించని మొత్తాన్ని ఒకేసారి సొంతం చేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పోస్ట్ ఆఫీస్లు, బ్యాంకు లు కొన్ని పథకాలను ప్రజల కోసం అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేసినా.. మీరు వచ్చే పది సంవత్సరాలు రూ.1.25 లక్షలు మీరు సొంతం చేసుకోవచ్చు.. స్టాక్ మార్కెట్ రిస్కు కి లోనవుతుందనేది కూడా నిజమే.. అయినప్పటికీ దానిలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక సొంత రిస్క్ అలాగే నిర్ణయంతో చేయాలి.. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచి లాభం వస్తుంది..


సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది పెట్టుబడికి రెగ్యులర్ ఇంకా సిస్టమాటిక్ మార్గం.. దీని కింద స్టాక్ మార్కెట్లో క్రమమైన వ్యవధిలో పెట్టుబడి పెట్టడానికి చిన్న మొత్తం కానీ ముందుగా నిర్ణయించిన మొత్తం కేటాయించబడుతుంది. ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ఇది పద్ధతిగా పరిగణించబడుతుంది. మొదటిది రూపాయి ధర సగటు మరియు రెండవది వివిధ అంశాలు.. మార్కెట్ అస్థిరత నుండి మిమ్మల్ని రక్షించడంలో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ చక్కగా సహాయపడుతుంది. ఇకపోతే మీరు ప్రతి నెల రూ.500 ను ఇందులో పెట్టుబడిగా పెట్టాలి.. 10 సంవత్సరాల పాటు కొనసాగిస్తే దానిపై ఆధారంగా మీరు మంచి మొత్తాన్ని పొందవచ్చు.. సగటు రాబడి రేటు 12 శాతం వద్ద రూ.60,000 పెట్టుబడికి రూ.56,170 లభిస్తుంది..  ఈ విధంగా మీ మొత్తం రూ .1,16,170 అవుతుంది.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది పురుషులు అలాగే మహిళలు ఇద్దరు ఇన్వెస్ట్ చేయవచ్చు.. ఇక ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు అతి తక్కువ సమయంలోనే మంచి ఆదాయాన్ని పొందే వీలు ఉంటుంది. ఏది ఏమైనా పెట్టుబడి మార్గాలే మీకు ఆదాయాన్ని అందిస్తాయి అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: