కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది.. పేదల ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పథకాలను కూడా తీసుకువస్తోంది. అందులో ముఖ్యంగా జాతీయ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ కూడా ఒకటి.. దీని వల్ల భారత దేశంలో వివిధ ప్రభుత్వ ప్రయోజన ఆరోగ్య భీమా పథకాలు కూడా ఇందు లో ఉంటాయట.. వివిధ రాష్ట్రాలలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి 30 నుంచి 3 లక్షల వరకు పరిమితి ఉంటుందట. Pm -jay జాబితా చేయబడిన ద్వితీయ, తృతీయ సంరక్షణ పరిస్థితుల కోసం అర్హత ఉన్నటువంటి కుటుంబాలకు రూ .5 లక్షల రూపాయల వరకు నగదు రహిత కవరేజ్ను కూడా అందిస్తుందట. ఈ స్కీం కింద భాగాల కోసం అయ్యే ఖర్చులను అందిస్తుందట..


1). వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చు..
2). చికిత్స మరియు కౌన్సిలింగ్ ఆస్పత్రిలో చేరే ముందు మందులు.
3). రోగనిర్ధారణ మరియు ప్రయోగశాల పరిశోధనల కోసం అయ్యే ఖర్చు..
4). మెడికల్ ఎమర్జెన్సీ సేవలకు అయ్యే ఖర్చు..
5). హాస్పటల్లో ఉండేటువంటి రూము ,ఆహార సేవలు చికిత్స సమయంలో 15 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటే అందుకు తగ్గట్టు గా సంరక్షణ కోసం కూడా డబ్బులను చెల్లిస్తారట.

అయితే ఈ ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన ధృవీకరణ పత్రాల విషయానికి వస్తే..ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ , క్యాస్ట్, ఇన్కమ్, ఫోటో నివసిస్తున్నటువంటి ధ్రువీకరణ పత్రం, మొబైల్ నెంబర్


ఆయుష్మాన్ భారత్ కార్డు యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే..

1). రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో రూ.5 లక్షల వరకు ఉచితం గానే చికిత్సను చేసుకొని అవకాశం ఉంటుంది.

2). 15 రోజులపాటు ఆసుపత్రి ఖర్చులను కూడా కవరేజ్ చేస్తుంది.. ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్..https://pmjay.gov.in/ 2024 అధికారిక వెబ్ సైట్  సందర్శించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: