ప్రస్తుతం ఎక్కువగా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి.. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. మనదేశంలోనే కాకుండా ఇతర దేశంలో కూడా పలు ప్రాంతాలలో తీవ్రమైన వేడుగాలులు ఉన్నాయట. ఈసారి రైతుల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఎక్కువ ఖర్చు చేసి సాగు చేసిన పంటలను సైతం రైతులు నష్టపోతే.. వీటి నుంచి కోలుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది.. అయితే ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులకు ఫసల్ బీమా పథకాన్ని కూడా అమలు చేసింది. ఈ పథకం 2016లో అమలు చేశారు. చాలా మంది రైతులకు కూడా దీని ద్వారా ఉపశమనం కలిగించింది.


ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు ఏదైనా నష్టం జరిగితే బీమా పథకాల ద్వారా పరిహారాన్ని అందుకోవచ్చు. అతివృష్టి, అనావృష్టి, వేడిగాలులు, తుఫానులు ఇతర ప్రకృతి వైపర్యాల వల్ల రైతులు పంటలు నష్టపోతే రైతులకు పరిహారం కూడా లభిస్తుందట. ఇలాంటి ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వెంటనే భీమా కంపెనీకి కానీ.. స్థానిక వ్యవసాయ కార్యాలయానికి 72 గంటలలో సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.. దీంతో వారు ఎంత మేరకు నష్టం జరిగిందో తెలియచేసి ఆ తర్వాత పంట బీమాను అందిస్తారు.


ప్రధానమంత్రి పంట బీమా యోజన పథకం కింద రైతుల పంట నష్టం కనీసం 30% వరకు జరగాలంట.. అప్పుడే మీరు పరిహారాన్ని క్లైమ్ చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. సాధారణంగా మీరు బీమా క్లైమ్ కోసం దరఖాస్తు చేసుకున్న రెండు వారాల లోపే ఈ పరిహారం మొత్తం కూడా ఖాతాకు చేరుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఫసల్ బీమా యోజన అధికారిక వెబ్ సైట్ సంప్రదించి అక్కడ సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకొని రైతులు వీటికి అప్లై చేసుకోవాలి.. అంతేకాకుండా అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఫోటోల రూపంలో తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: