దేశంలో ఎక్కువమంది వ్యవసాయం మీద జీవనం సాగిస్తున్నారు.. అందుకే ప్రభుత్వాలు కూడా ఎక్కువగా వ్యవసాయ రంగానికే పెద్ద పీట వేస్తూ ఉంటారు. చాలామంది ప్రజలు వ్యవసాయం చేస్తే లాభం ఉండదని అనుకుంటూ ఉంటారు.. అయితే ఒకవేళ అవగాహన ఉండి వ్యవసాయం చేస్తే అద్భుతమైన లాభాలను కూడా అందుకోవచ్చు.. అది కూడా తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి వెదురు సాగు మంచి లాభాలను అందిస్తుంది. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


దేశంలో వెదురు పండించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. అందుకే వీటికి మంచి డిమాండ్ పెరుగుతోంది.. ఇతర పంటలతో పోలిస్తే ఖచ్చితంగా వెదురు పెంపకం చాలా లాభాలను అందిస్తుందని తెలుస్తోంది. ఏ సీజన్లో నైనా సరే వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి ఈ మొక్కను నాటితే చాలు కొన్నేళ్లపాటు లాభాలను అందిస్తుంది. వెదురు సాగు తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను అందిస్తుంది. ఇది బంజరు భూములో ఎక్కడైనా సరే నాటుకోవచ్చు. అయితే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలను కొనుగోలు చేసి నాటడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..


వెదురు మొక్కలు నాటేటప్పుడు 2 అంగుళాల వెడల్పు లోతుతో అలా నాటిన తర్వాత ఎరువు వేయడం వల్ల మొక్కకు నీరు పోస్తూ ఉండడం వల్ల ఎండల బారి నుంచి ఈ మొక్కలను కాపాడుకోవచ్చు. ఒక హెక్టార్ కి 700 మొక్కల వరకు నాటుకోవచ్చు. పంట వేసిన మూడు నాలుగు సంవత్సరాలలో ఈ పంట కోయడానికి సిద్ధమవుతుందట. 2006- 2007 సంవత్సరంలో జాతీయ వెదురు మిషన్ ని కూడా మొదలుపెట్టారు. అలాగే ఈ పంటకు సబ్సిడీ కూడా ఉంటుందట. కాగితం తయారుచే కాకుండా దుస్తులలో కూడా తయారు చేయడానికి ఈ విధులను ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి పంట వేస్తే 40 ఏళ్ల వరకు కొనసాగుతుందట. నాలుగేళ్లకు ఒకసారి రూ .40 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. కోత కోసిన తర్వాత కూడా మళ్లీ పెరుగుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: