మహానటి వంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం జాతిరత్నాలు. నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలతో అనుదీప్ కేవీ దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా చేసింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు లవర్ బాయ్ విజయ్ దేవరకొండ వంటి హీరోలతో ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ ఈ సినిమాపై ముందు నుండే హైప్ క్రియేట్ చేశాయి.