టాలీవుడ్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం మా ఇంటి బంగారం. ఈ సినిమా జూన్ 19వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా సమంత సినిమా ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్కుకి చేరుకుంది. ఈ సినిమాతో సమంత మరొకసారి కం బ్యాక్ ఇచ్చిందని అభిమానులు ఆనందపడుతున్నారు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా సమంత ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడింది ఈ విషయాన్ని డైరెక్టర్ నందిని రెడ్డి కూడా అఫీషియల్ గా తెలియజేశారు.



మా ఇంటి బంగారం చిత్రంలో సమంత నటన , యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సమంతతో పాటుగా శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, మంజుష, ఆనంద్, తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రంలో ఒక నటుడు మాత్రం అందరిని ఆకట్టుకున్నారు. సినిమాలో సమంతను ఫాలో అవుతూ తరచు ఆమెతో తిట్టించుకుంటూ, చివరిలో సమంత ఫైట్ సీన్లో కూడా గరిటతో కొట్టించుకొని మరింత హైలైట్ గా నిలిచారు ఈ యాక్టర్. అయితే ఈ యాక్టర్ మాత్రం ఎవరో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.


అతని పేరు వంశీ అతను ఎవరో కాదు ప్రముఖ జబర్దస్త్ షోలో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించిన ఇమ్మాన్యుయేల్  అన్నయ్య అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా కొన్ని టీవీ షోలలో వంశీ కనిపించినప్పుడు కూడా తన మొదటి సినిమా సమంత సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలియజేశారు. మా ఇంటి బంగారం సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వంశీ. మరి రాబోయే రోజుల్లో వంశీకి విలన్ గా మరిన్ని పాత్రలు వస్తాయేమో చూడాలి మరి. అలాగే ఈ యాక్టర్ డైరెక్టర్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: