సూపర్ హిట్ ఇస్తే అంతే మరి. ఈరోజుల్లో అవకాశం వచ్చి... దాన్ని సద్వినియోగం చేసుకున్నవాళ్లను అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే దర్శకుడు శ్రీనివాసరెడ్డిని కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఢమరుకం భారీ విజయం తరవాత శ్రీనివాసరెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. ఇద్దరు ప్రముఖులు ఆయనకు ఫోన్ చేశారట. వాళ్లు మరెవరో కాదు... వెంకటేష్, ఎన్టీఆర్. ఇద్దరూ... చాలా బాగా హ్యాండిల్ చేశావని ప్రశంసల వర్షం కురిపించారట. అంతేకాదు, మరో ఆఫర్ కూడా ఇచ్చారట. అదేంటో తెలుసా... కథ ఉంటే చెప్పమని. ఒక దర్శకుడికి అంతకంటే ప్రోత్సాహం ఏం కావాలి? దాంతో శ్రీనివాసరెడ్డి దిల్ ఖుష్ అయిపోయిందట. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి అన్నారు పెద్దలు. అందుకే, శ్రీనివాసరెడ్డి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారట. ఇప్పటికే తన వద్ద సిద్ధంగా ఉన్న కథను వెంకటేష్ కు వినిపించడానికి సిద్ధమయ్యారట. ఒకట్రెండు రోజుల్లో వెంకటేష్ అపాయింట్ మెంట్ తీసుకుని కథ చెప్పనున్నాడట. అది వెంకటేష్ కి బాగా సూటవుతుందనీ, కామెడీ చాలా బాగుంటుందనీ శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి, ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు చేస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: