తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ నటించిన తొలి తమిళ చిత్రం ఒరు కల్ ఒరు కన్నాడి తెలుగులో ఓకే ఓకే పేరుతో విడుదల కానుంది. ఇందులో హీరోతో పాటు ఈక్వెల్ పాత్రలో సంతానం నటించారు. సంతానం పాత్రకు తెలుగులో సునీల్ డబ్బింగ్ చెప్పారట. సునీల్ ఓ వైపు హీరోగా నటిస్తూ వచ్చిన ఎన్నో కమెడియన్ వేషాలను వదులుకుంటున్నారు. ఈ తరుణంలో సంతానం పాత్రకు ఎందుకు డబ్బింగ్ చెప్పినట్టు? అనేది ఫిల్మ్ నగర్ హాట్  టాపిక్. బెల్లంకొండ భారీగా ముట్టజెప్పినట్టు కొందరు అంటున్నారు. బెల్లంకొండ సినిమాలో సునీల్ ఓ హీరోగా చేస్తున్నారు కాబట్టి ఆ మొహమాటంతో డబ్బింగ్ చెప్పి ఉండవచ్చని మరికొందరు అంటున్నారు. తమిళనాడులో భవిష్యత్తులో ఏదైనా కావాల్సి వస్తే ఉదయనిధి స్టాలిన్ సహకారం లభిస్తుందన్న భావనతో ఐస్ చేసుకోవడానికి కూడా ఇలా చేసి ఉంటారని కొందరు చెప్తున్నారు. ఏదేమైనా ఇది మంచి పరిణామమే అని పలువురు కితాబిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: