కాలేజ్ స్టూడెంట్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కాలేజ్ స్టూడెంట్ గా నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించాడు. ఈ సినిమా వినోదాత్మంగా ఉంటుందని తెలిపాడు.
ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే నెల 3 నుంచి 11 వరకూ హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ జరపుకొంటుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ - సమంతాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుంది.
గబ్బర్ సింగ్ సినిమా తరువాత హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే గతంలో జూనియర్ ఎన్టీఆర్ - దిల్ రాజు కలయికలో ‘బృందావనం’ అనే సూపర్ హిట్ వచ్చింది. దింతో ఈ కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి