ఢిల్లీ డాల్ తాప్సీ పుట్టింది పంజాబీ కుటుంబంలో. చిన్నప్పటి నుంచి ఈ అందాల నటికి కుస్తీ పోటీలంటే చాలా ఇష్టమట. అందుకే రెజ్లర్ కావాలని చాలా ఆశపడిందట. కానీ ఆమె ఆశలు అడియాసలే అయ్యాయి. చూడ్డానికి సుకుమారంగా ఉండే తాప్సీ కుస్తీ పోటీల కోసం కండలు పెంచితే బావుండదని తల్లిదండ్రులు నచ్చజెప్పారట. అప్పటి నుంచి మోడలింగ్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం గుండెల్లో గోదావరిలోనూ, చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో గోపీచంద్ సరసన నటిస్తోంది. గోపీతో తాప్సీకి ఇది రెండో సినిమా. షాడో వెంకటేష్ పక్కన నటిస్తోందీ సొట్టబుగ్గల చిన్నది.
మరింత సమాచారం తెలుసుకోండి: