యవహీరో రామ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఒంగోలు గిత్త’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను బుధవారం రాత్రి నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను అన్నపూర్ణ స్టూడియోలో ఒంగోలు గిత్త పాట చిత్రీకరణ కోసం వేసిన సెట్లో నిర్వహిస్తున్నారు.
ఈ విషయాన్ని హీరో రామ్ స్వయంగా వెల్లడించాడు. సినిమా ఆడియోను నిర్వహించాలని నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ఆకస్మాత్తుగా నిర్ణయించారని రామ్ తెలిపాడు.
కృతి కర్బందా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి