సెన్సషన్ దర్శకుడు శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీనికి తెలుగులో ‘మనోహరుడు’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం కోసం ఆ మధ్య కొన్నాళ్లు సెలువు తీసుకున్నాడు విక్రమ్.
ఎందుకంటే, బరువు తగ్గడానికట. ఈ సినిమా కోసం ఏకంగా 12 కిలోల బరువు తగ్గాడు విక్రమ్. ఆహార నియమాలను పూర్తిగా మార్చేసుకున్నాడట. ఒక శిక్షకుడి పర్యవేక్షణలో దాదాపు రోజంతా జిమ్ లోనే గడిపేవాడు. అంతేకాదు, గడచిన మూడు నెలలుగా కుటుంబానికి కూడా దూరంగా ఉన్నాడట విక్రమ్.
సినిమా అంటే ఎంత కమిట్ మెంటో. విక్రమ్ ని చూసి ఎంతోమంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా. అంకిత భావం అంటే అలా ఉండాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: