సంక్రాంతిలో వెంకటేష్, శ్రీకాంత్ ఇద్దరూ అన్నదమ్ముల్లా కనిపించారు. ఇప్పుడు షాడో కోసం బావా బామ్మర్దులుగా మారారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... షాడో, బావా బామ్మర్దుల కథ. మధురిమ వెంకటేష్ చెల్లాయిగా నటించింది. తన ముద్దుల చెల్లెల్ని ఓ నీతి నిజాయతీ ఉన్న పోలీస్ అధికారికి ఇచ్చి పెళ్లి చేస్తాడు వెంకీ.
అయితే వెంకీ లోపలి మనిషి వేరు. అరాచక వాదుల్ని హతమార్చి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారవుతాడు. లాండ్ అండ్ ఆర్డర్‌ని చేతుల్లోకి తీసుకొంటాడు. అతన్ని పట్టుకొనే బాధ్యత శ్రీకాంత్‌కి అప్పగిస్తారు. వెంకీని శ్రీకాంత్ ఓ షాడోలా వెంటాడతాడన్న మాట. అదీ... ఈ సినిమా కథ. ఈ సినిమాలో వెంకీ ఓ డాన్ పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అందులోనూ నిజం లేదు. మాఫియాకూ ఈ కథకూ సంబంధం లేదు.
ఉగాది సందర్భంగా ఏప్రెల్ 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
మరింత సమాచారం తెలుసుకోండి: