హీరో రామ్ చరణ్ కు గాయాలు అయ్యాయి. రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఎవడు’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో ఈ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో రామ్ చరణ్ కు గాయాలు అయ్యాయి. ఫైటింగ్ సీన్ చిత్రీకరణలో భాగంగా పై నుంచి దూకే సన్నివేశంలో రామ్ చరణ్ అదుపు తప్పి పడినట్లు తెలుస్తుంది. దీంతో రామ్ చరణ్ కొద్ది సేపు సృహా కోల్పవడమే కాక, అతని ఎడమ చేయి బోటనవేలుకు గాయం అయ్యింది. అతన్ని వెంటనే చికిత్సకోసం తరలించామని, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలను మరింత మక్కువతో చేయడానికి ఇష్టపడతాడని, అందుకే ఈ గాయ్యాలు అయ్యాయని అతని సన్నిహితులు చెబుతున్నారు. గతంలో ‘రచ్చ’ సమయంలో కూడా రామ్ చరణ్ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: