ఇటీవల కాలంలో అందరి దృష్టిని ఆకర్సించిన హీరోయిన్ అంజలి. వేధింపులు, అదృశ్యం అంటూ మీడియాను తనవైపు తిప్పుకుంది అంజలి. ఇదంతా కావాలని చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె కెరియర్ ఏమోవుతుందనో అందోళనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా అంజలికి ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ సపోర్ట్ లభించింది. ఈ సపోర్ట్ మాటల రూపంలో కాదు.. చేతల రూపంలో...! ‘గబ్బర్ సింగ్’ సినిమాకు సీక్వెల్ తీయడానికి పవన్ కళ్యాణ్ సిద్దపడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. దీంతో వివాదాలు ఎదుర్కొంటున్న అంజలికి మంచి సపోర్ట్ లభించినట్లుగా చెప్పుకోవచ్చు. ఈ ‘గబ్బర్ సింగ్-2’కు సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండగా, శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: