ప్రస్తుతం తమన్నా హాలిడే మూడ్లో ఉంది. సినిమాల్లేవు. షూటింగులు లేవు. కొత్త కథలు వినడం లేదు. కేవలం కుటుంబంతో గడపడానికి సమయం కేటాయిస్తోంది. తన ఫ్యామిలీతో ఫారెన్లో సరదాగా గడుపుతోంది.
''గత కొన్నేళ్లుగా సినిమాలతోనే గడిపాను. రోజుకి మూడు షిప్టులు పనిచేసిన సందర్బాలున్నాయి. ఇంటిని చాలా మిస్ అయ్యా. ఇప్పుడు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉందామనుకొంటున్నా. మళ్లీ రిఫ్రెష్ అవ్వడానికి ఈ విశ్రాంతి చాలా అవసరం..'' అంటోంది.
''శరీరం, మనసూ రెండూ విశ్రాంతి కోరుకొంటున్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై అంటూ కొంతకాలం చక్కర్లు కొట్టా. ఇప్పుడు రిలాక్స్ అవుతున్నా. షూటింగుల నిమిత్తం ఇది వరకు చాలాస్లార్లు విదేశాలకు వచ్చా. కానీ ఎప్పుడూ ఇంతలా ఎంజాయ్ చేయలేదు..'' అని మురిసిపోతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: