శేఖర్ కమ్ముల లీడర్ పోరి ప్రియా ఆనంద్ మోసపోయిందట. ఈ సుందరిని మోసం చేసింది మరేవరో కాదు తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్. కొలవరి.. కొలవరి.. పాటతో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ప్రియ ఆనంద్ కు ఫోన్ చేసి తన సినిమాలో నటిస్తావా.. అని అడిగాడట. అసలే అవకాశాలు లేని ప్రియా లేక ఖాళీగా ఉన్న ప్రియా వెంటనే ఒప్పుకుందట. ధనుష్ తో చాన్స్ వచ్చిందని ఎగిరి గంతేసిందట.
అయితే అసలు విషయం తరువాత తెలిసింది. ధనుష్ చాన్స్ ఇచ్చింది తనతో నటించడానికి కాదట. ఓ కొత్త కుర్రాడితో తాను నిర్మించబొతున్న చిత్రంలో ప్రియాకు ఛాన్సు ఇచ్చాడట. అసలు సంగతి తెలిసిన ప్రియా కక్కలేని, మింగలేని స్థితిలో ఉందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి