వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని డిసెంబర్ లో ఎం.సి.ఏ తో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్న నాని ఆ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా లో నాని డ్యుయల్ రోల్ చేస్తుండటం విశేషం. అంతేకాదు ఈ సినిమా తర్వాత నాగార్జునతో మల్టీస్టారర్ కూడా చేస్తున్నాడు నాని.
శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో మల్టీస్టారర్ రాబోతుంది. ఇవి రెండూ కాకుండానే మరో సినిమా కూడా సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో చేస్తున్నాడట నాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సంతోష్ శ్రీనివాస్ సినిమా కన్ ఫాం అవగా.. ప్రస్తుతం పవన్ సినిమా చేయడం కుదరని పని తేల్చి చెప్పడంతో పవన్ తో చేయాలనుకున్న అదే కథతో నానితో చేస్తున్నాడట సంతోష్ శ్రీనివాస్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎక్కడ నాని ఇమేజ్ ఎక్కడ. అయినా పవన్ కు సరిపోయే కథతో నాని ఎలా సెట్ అవుతాడని అనుకున్నాడో కాని ఆ కథనే నానికి తగినట్టుగా మార్చి తీయాలని ఫిక్స్ అయ్యాడట సంతోష్ శ్రీనివాస్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.
ఇప్పటికే నాని వరుస విజయాలను అందుకుంటున్నా.. రొటీన్ కథలే చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. మరి నాని పవన్ రేంజ్ కథ అంటే అది కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటేల్స్ మరికొద్దిరోజుల్లో వెళ్లడిస్తారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి