పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్‌ తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడమే లక్ష్యంగా పవన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ లేదా వరుణ్‌ తేజ్‌ల్లో ఒకరు హీరోగా నటించబోతున్న చిత్రంలో పవన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పవన్‌ రాజకీయ మైలేజ్‌ పెంచే విధంగా ఆ చిత్రం ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. 


రామ్‌ తాళ్లూరి ఈ సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నాడంటూ ప్రచారం జరిగుతున్న నేపథ్యంలో స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తనకు సినిమాల్లో నటించే సమయం లేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రజా క్షేత్రంలోనే తాను చాలా బిజీగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు. సినిమాలు చేయాలి అంటే చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అంత సమయం నా వద్ద లేదని పవన్‌ పేర్కొన్నాడు. పవన్‌ అభిమానులు ఈ ప్రకటనతో తీవ్ర స్థాయిలో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. 


అయితే కొందరు మాత్రం పవన్‌ సినిమా చేయాలని మళ్లీ మనసు మార్చుకున్నట్లుగా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో సినిమాలు చేస్తే రాజకీయాల్లో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్‌ నిర్ణయాన్ని మార్చుకున్నాడని కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటో ఆ పవన్‌ కే తెలియాలి.  


పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి చిత్రం ఆయన చివరి చిత్రం అనే విషయం తెల్సిందే. పవన్‌ రీ ఎంట్రీ గురించి 2019 ఎన్నికల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ అనేది జనసేన వచ్చే ఎన్నికల్లో సాధించే సీట్లను బట్టి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి పవన్‌ రీ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: