కార్తీక్, ముచ్చర్ల అరుణ జంటగా వచ్చిన సీతాకోక చిలుక సినిమా సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో అంతా కొత్తవారితో తీసిన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేమకథల్లో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
కాగా, ఈ సినిమా కోసం వేటూరి రాసిన ‘సాగర సంగమమే..’ అనే పాట చిత్ర దర్శకుడు భారతీరాజాకు ఎంతగానో నచ్చింది. దీంతో ఈ సినిమాకు సాగర సంగమం అనే టైటిల్ పెట్టాలని ఆయన భావించారు. అయితే కథాపరంగా అంత క్లాస్ టైటిల్ తో పని కాదని చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ‘సీతాకోక చిలుక’ టైటిల్ ను సూచించారు. అందరికీ ఈ టైటిల్ నచ్చడంతో కంటిన్యూ అయ్యారు.
కాగా, ఇదే బ్యానర్ లో తరువాత ‘సాగర సంగమం’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: