అహా నా పెళ్లంట సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వీరభద్రం తరువాత పూలరంగడు సినిమాను రూపొందించారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా భాయ్ అనే సినిమాను తెరక్కించడానికి వీరభద్రం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కాగా, వీరభద్రంతో ఒక సినిమా చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించినట్లు తెలుస్తుంది. వీరభద్రం చెప్పిన కథ నచ్చడంతో అతనితో సినిమ చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించినట్లు ఫిల్మ్ నగర్ నుంచి వస్తున్న తాజా సమాచారం. పూరీతో అల్లు చేసే ఇద్దరమ్మాయిలతో సినిమా తరువాత ఇది సెట్స్ మీదకు వస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: