రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాను తెలుగు, తమిల భాషల్లో ఒకేసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారంతో ఈగ సినిమా 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ఈ రెండు బాషల్లోనూ ఈగ మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. నాన్ ఈ పేరుతో తమిళంలో విడుదలైన రాజమౌళి ఈగ అక్కడ 50 రోజుల్లోనే 25 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. అలాగే ఈ సినిమా తెలుగులోనూ దాదాపు 50 కోట్ల వరకూ వసూలు చేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: