సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న సమంత అక్కినేని ఫ్యామిలీ కోడలిగా వచ్చాక మరింత ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. మాములుగా అయితే పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరియర్ దాదాపు ముగుస్తుంది కాని సమంతకు మాత్రం పెళ్లి తర్వాత మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.


ఈ ఇయర్ ఆల్రెడీ మజిలీ, ఓ బేబీ సినిమాలతో సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ 96 రీమేక్ లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా అమేజాన్ ప్రైం నిర్మిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సీక్వల్ లో నటిస్తుంది. ఈ రెండు పూర్తి చేశాక సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉందట సమంత.


పిల్లలంటే సమంతకు చాలా ఇష్టం పెళ్లి అయ్యి రెండేళ్లయింది. అందుకే సమంత ఇక పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. తల్లి అయ్యేందుకు అమ్మడు ఆరాటపడుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం కమిటైన సినిమాలు పూర్తి చేసి ఇక పిల్లలు కనేందుకు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకునే ఆలోచనలో ఉందట సమంత.


సమంత హెల్త్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే పిల్లలు కనేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందట. అందుకే ఇక సినిమాలకు ఓ లాంగ్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సమంత, చైతుల వారసుల కోసం అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా శేఖర్ కమ్ముల సినిమాలో కూడా నటిస్తున్నాడు చైతు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న శేఖర్ కమ్ముల మూవీకి లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: