సినిమాల్లోకి బాల నటుడిగా ప్రవేశించి ఇప్పుడు హీరోగా మారిన తనీష్ తన పుట్టిన రోజును శుక్రవారం నాడు ఘనంగా జరుపుకున్నాడు. కాగా, ఇప్పటికే నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్న తనీష్ హీరోగా దేవదాస్ స్టైల్ మార్చాడు అనే కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం నాడు ప్రారంభ మయ్యింది.
దేవదాస్ స్టైల్ మార్చాడు సినిమా ఫస్ట్ లుక్ ను హీరో తనీష్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం నాడు విడుదల చేశారు. ఇందులో తనీష్ కొత్త గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో వి.యస్.రామిరెడ్డి నిర్మిస్తున్నారు. అలాగే సూర్య కిరణ్ దర్శకత్వంలో తనీష్ హీరోగా నువ్వు సరిగమ నేను పదనిస అనే సినిమా కూడా తెరకెక్కుతుంది.
ఇప్పటి వరకూ తనీష్ చాలా సినిమాలలో నటించినా హీరోగా మాత్రం ఆశించిన గుర్తింపు మాత్రం తెచ్చుకోలేక పోయాడు. ఈ పుట్టిన రోజు సంవత్సరంలో మంచి బ్రేక్ లభించాలని కోరుకుందాం.
మరింత సమాచారం తెలుసుకోండి: