నందమూరి బాలకృష్ణ హీరోగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ సినిమా ఈరోజు విడుదలైంది. 30 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రూలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కి నష్టాలతో విడుదలైన రూలర్ సినిమాకు ఆశించిన మేర టాక్ కూడా రాలేదు. నెగిటివ్ టాక్ నేపథ్యంలో రూలర్ ఎంత కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాల్సి ఉంది. 
 
రూలర్ నైజాం హక్కులు 5 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్ముడవగా సీడెడ్ హక్కులు 5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో రూలర్ 3 కోట్ల రూపాయలకు అమ్ముడవగా వైజాగ్ ఏరియా హక్కులను డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల 50 లక్షల రూపాయలకు కొన్నారు. గుంటూరు జిల్లా హక్కులు 2 కోట్ల 70 లక్షల రూపాయలకు అమ్ముడవగా కృష్ణా హక్కులు కోటీ 60 లక్షలు, నెల్లూరు జిల్లా హక్కులు కోటీ 10 లక్షలకు అమ్ముడయ్యాయి. 
 
సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఇవెన్ అవ్వడం కష్టమేనని తెలుస్తోంది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ విడుదలకు ముందే సినిమాకు ఆశించినంత క్రేజ్ లేకపోవడం, రొటీన్ మాస్ మసాలా యాక్షన్ సినిమా కావడంతో భారీగా కలెక్షన్లు కూడా రావడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ లాంటి మేజర్ ఏరియాలో టికెట్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగటం లేదని సమాచారం. 
 
వీకెండ్ తరువాత రూలర్ సినిమా నష్టాల గురించి అంచనాకు రావచ్చు. ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాలు ఇటు అభిమానులను, అటు డిస్ట్రిబ్యూటర్లను నిరాశ పరుస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికైనా బాలకృష్ణ కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని బాలయ్య అభిమానులు, సగటు సినీ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 2019 సంవత్సరంలో బాలయ్య నటించిన కథానాయకుడు, మహానాయకుడు డిజాస్టర్లు కాగా రూలర్ కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేయటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: